జెమీమా రోడ్రిగ్స్ డ్యాన్స్‌కు ఐసీసీ ఫిదా..
By Newsmeter.Network Published on 27 Feb 2020 6:01 PM ISTటీమిండియా బ్యాట్స్‌ఉమెన్ జెమీమా రోడ్రిగ్స్ మైదానంలో ఉందంటే చాలు.. అటు అభిమానులతో పాటు ఇటు కెప్టెన్‌కు కొండంతం విశ్వాసం. పరిస్థితులకు తగ్గట్లుగా తన బ్యాటింగ్ మార్చుకుంటూ నిలకడగా రాణిస్తోంది. జట్టులోకి వచ్చి రెండేళ్లైన కాలేదు. సీనియర్ ప్లేయర్‌లా జట్టు బాధ్యతను భుజాన మోస్తూ టీమిండియాకు విజయాలను అందిస్తోంది. మైదానంలో ఎంత ప్రొఫెనల్‌గా ఉంటుందో.. మైదానం బయట అంత అల్లరి చేస్తుంది రోడ్రిగ్స్. ఇటీవల కాలంలో భారత మహిళల డ్రెసింగ్ రూంలో సరదాలు ఎక్కువవుతున్నాయంటూ.. భారత్ ఓపెనర్ స్మృతి మంధాన చెప్పింది రోడ్రిగ్స్ గురించే. అందరితో కలిసి పోయి అల్లరి చేయడం రోడ్రిగ్స్‌కే సాధ్యం అంటూ సహాచర క్రీడాకారిణులు చెబుతున్నారు.
తాజాగా రోడ్రిగ్స్‌కు ఐసీసీ కూడా ఫిదా అయింది. ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు బయల్దేరిన రోడ్రిగ్స్ సెక్యూరిటీ గార్డుతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. చాలా ఫన్‌గా ఉన్న ఆ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెక్యూరిటీతో కాలు కదిపిన రోడ్రిగ్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. డ్యాన్స్ బాగుందని ఒకరు కామెంట్ చేయగా.. వరల్డ్ కప్‌తో తిరిగి రావాలని మరొకరు ట్వీట్ చేశారు.
కాగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టీ20 మహిళల వరల్డ్ కప్‌లో నేడు న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు సెమీపైనల్‌లో అడుగుపెట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (46; 34 బంతుల్లో 4పోర్లు, 3సిక్సర్లు) వన్ డౌన్ బ్యాట్ ఉమెన్ బాటియా(23; 25 బంతుల్లో 3పోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 133 పరుగులు చేసింది. అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది.