ఫోన్‌లో మాట్లాడుతున్న యువతి.. మందలించిన తల్లి.. చివరికి

By Newsmeter.Network  Published on  2 Feb 2020 9:04 AM GMT
ఫోన్‌లో మాట్లాడుతున్న యువతి.. మందలించిన తల్లి.. చివరికి

తల్లి మందలించిందని.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఘటన వివరాల్లోకి వెళితే.. భగత్‌సింగ్‌నగర్‌ సమీపంలోని కాలనీకి చెందిన ఓ మహిళ కుమారుడు, కుమారై(18) తో కలిసి నివసిస్తోంది. ఆమె జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. కాగా ఆమె కుమారై అపార్ట్‌మెంట్‌లో చిన్నపిల్లలను ఆడించే కేర్‌ టేకర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో యువతికి అదే అపార్ట్‌మెంట్‌ కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు అతడితో ఫోన్ లో మాట్లాడేది.

రెండు రోజుల క్రితం విధులకు వెళ్లకుండా అతడి జన్మదిన వేడుకల్లో యువతి పాల్గొంది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి యువతిని మందలించింది. తల్లి విధులకు వెళ్లగా.. కొడుకు లేచి చూసే సరికి యువతి ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని కనిపించింది. స్థానికులు తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story