జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్ రెడ్డికి బెయిల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 11:43 AM GMT
జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్ రెడ్డికి బెయిల్‌

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ ఆస్మిత్‌ రెడ్డిలకు అనంతపురం జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారన్న అభియెగంపై జేసి ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఏడాది జూన్‌ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వీరిని అనంతపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న దానిపై కూడా జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అశ్విత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం వీరిద్దరూ కడప జైలులో ఉన్నారు. రిమాండ్‌లో ఉన్న వీరిద్దరికి మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it