జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడి అరెస్టు టీవీల ద్వారానే తెలిసిందని చెప్పారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.