JBS-MGBS మెట్రోకు గ్రీన్ సిగ్నల్..!

By Newsmeter.Network  Published on  14 Jan 2020 6:44 AM GMT
JBS-MGBS మెట్రోకు గ్రీన్ సిగ్నల్..!

మహానగర ప్రజలకు హైదరాబాద్‌ మెట్రో మరో శుభవార్త అందించింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిపై అధికారుల నుంచి అనుమతి లభించింది. ఈ మర్గానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైల్‌ సేఫ్టీ అనుమతి ఇస్తూ భద్రత ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మధ్య మెట్రో పొడవు 10 కి.మీలుగా ఉంది. ఈ కారిడార్‌ ప్రారంభమైతే మొదటి దశలో భాగంగా చేపట్టిన 66 కి.మీ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు నిర్మించిన కారిడార్‌ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి సిగ్నలింగ్‌, వేగం, పవర్‌, స్టేషన్లను చేశారు. కెనాడాలోని థాలెస్‌ కంపెనీ.. మెట్రో రైళ్లను ఆటోమెటిగ్గా నియంత్రించుకునే టెక్నాలజీని ఇచ్చింది.

ప్రయాణికులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెట్రో సంస్థ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కారణంగా ప్రజలు ఎక్కువగా మెట్రోకి ప్రాధాన్యం చూపుతున్నారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు వేగంగా తీసుకువెళ్తూ హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులను చూరగొంటోంది. రోజువారీ అధిక సంఖ్యలో ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌, నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు రెండు కారిడర్లలో పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు.. త్వరలో జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మధ్య కూడా నడవనున్నాయి. మెట్రో రైళ్లు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడవనున్నాయని మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story