ప్ర‌కాష్ రాజ్.. ఆ బ‌యోపిక్ లో న‌టిస్తున్నాడా..?

By Medi Samrat  Published on  11 Oct 2019 7:00 AM GMT
ప్ర‌కాష్ రాజ్.. ఆ బ‌యోపిక్ లో న‌టిస్తున్నాడా..?

ప‌రిచ‌య వ్యాఖ్యాలు అవ‌స‌రం లేని ప్రముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్. ఎప్పుడూ విభిన్న పాత్ర‌లు పోషించ‌డానికి త‌పించే ప్ర‌కాష్ రాజ్ ఓ బ‌యోపిక్ లో న‌టించ‌నున్నార‌ని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.... త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ 'త‌లైవి' రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌బోయే ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ పోషిస్తుంది.

అర‌వింద‌స్వామి త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎం.జి.రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. కాగా.. ఈ సినిమాలో జ‌య‌ల‌లిత ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. న‌వంబ‌ర్ నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఒక‌వైపు.. వ‌ర్క్ షాప్ మ‌రో వైపు జ‌రుగుతుంది.

క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌డం కొత్తేమీ కాదు.. ఈ పాత్ర‌ను ఆయ‌న చేస్తే.. ఈ పాత్ర‌ను ఆయ‌న రెండోసారి చేసిన‌ట్లు అవుతుంది. ఇది వ‌ర‌కు ఇద్ద‌రు చిత్రంలోనూ క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించి మెప్పించారు. ఇప్పుడు మ‌రోసారి క‌రుణానిధి పాత్ర పోషించ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది కానీ... అఫీషియ‌ల్ గా ఇంకా ఎనౌన్స్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Next Story
Share it