తమిళనాట అభిమాన దివంగత నేత  ‘జయలలిత’ జీవితం ఆధారంగా, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో  తమిళ దర్శకుడు ‘ఏ ఎల్ విజయ్’  దర్శకత్వంలో  ‘తలైవి’ పేరుతో  బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ భామ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్  కోసం ప్రత్యేకంగా  తమిళం కూడా నేర్చుకుంటుంది  ఈ హాట్ బ్యూటీ.  అయితే.. ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబు – జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన గాసిప్స్ లో వాస్తవం ఎంత.. వారి మధ్య నిజంగానే ప్రేమ ఉందా.. ఏ కారణాల చేత వాళ్ళు పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చింది..  అలాగే రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో  జయలలిత  పై జరిగిన దాడుల్లో  అప్పటి సీఎం కరుణానిధి పాత్ర ఎంత ఉంది  లాంటి విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే  జయలలిత లైఫ్ లోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు  ఆమె ఆలోచనా విధానాన్ని కూడా ఈ చిత్రంలో  హైలెట్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందని… వాటిల్లో  ముఖ్యంగా  తమిళ  రాజకీయాలను  జయలలిత ఎలా శాసించగలిగారు  ? ఆ ప్రాసెస్ లో జయలలిత ఎదురుకున్న  సవాళ్లు  ఏమిటి ? అసలు ఎలాంటి స్థాయి లేని  వ్యక్తులకి కూడా టికెట్లు ఇచ్చి ఎలా గెలిపించుకున్నారు ? అనే సంగతులను కూడా ఈ సినిమాలో  ప్రధానంగా చూపించనున్నారు. మొత్తానికి అమ్మ బయోపిక్ లో  అమ్మ  జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.