భారీ భూకంపం.. తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 నమోదు
By సుభాష్ Published on 7 Nov 2020 8:21 PM ISTజపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంపంతో జపాన్ తీరం వణికిపోయింది. జపాన్‌లోని చిచిజిమా సమీపంలో దీవిలో ఈ భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని టోక్యోకు 600 మైళ్ల దూరంలో ఉన్న ఒగాసవరా ద్వీపసమూహంలో ఈ భూకంపం వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంబంధించి వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. కాగా, ఈ దేశంలో తరచూ చాలా శక్తివంతమైన భూకంపాలు వస్తుంటాయి. 2011లో 9.0తీవ్రతతో భూకంపం రావడం సునామీ, అణు విద్యుత్ కేంద్రంలో విపత్తు సంభవించి సుమారు 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.