పార్టీకి దూరంగా లేను..దగ్గరగానూ లేను : ఎమ్మెల్యే రాపాక
By రాణి Published on 27 Feb 2020 5:59 PM IST
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానని తెలిపారు రాపాక. అయితే ఇటీవల కాలంలో తాను పవన్ కల్యాణ్ ను కలిసింది లేదని స్పష్టం చేశారు.
జనసేన పార్టీకి దూరంగా లేనని..అలాగని దగ్గరగా కూడా లేనని పేర్కొన్నారు రాపాక. రాష్ర్ట ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతిస్తానని తాను ముందే చెప్పానని..అందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కానీ రాపాక సీఎం జగన్ కు టచ్ లో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం మీడియాలో కూడా చాలా సార్లు ప్రస్తావనకొచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణకు తన మద్దతుంటుందన్నారు. విశాఖపట్నం రాష్ర్ట రాజధాని అయితే గోదావరి జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు.
గతంలో రాపాక జనసేన పై వ్యతిరేకంగా మాట్లాడారు. పార్టీ విధి విధానాలకు పవన్ కట్టుబడి లేరంటూ ఆరోపించారు.