లాంగ్ మార్చ్ కు రెడీ అవుతున్న జన సైనికులు
By న్యూస్‌మీటర్ తెలుగు
విశాఖపట్నంలో నవంబర్ 3న జనసేన లాంగ్ మార్చ్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో ఇసుక కొరత, తదితర సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ వేదికగా లక్షల మందితో లాంగ్ మార్చ్‌కు పిలుపు ఇచ్చారు. అయనే స్యయంగా ఫోన్ చేసి అనేక మంది పార్టీల నేతలను ఆహ్వానించారు. జనసేనాని పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌కు చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు మార్చ్‌లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు పెరుగుతున్నాయని నాయుడు ఆరోపించారు. "ఇసుక బాధితుల మరణాలను అపహాస్యం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనల కిందకు వస్తుందన్నారు, ఇవి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వం చేసిన హత్యలన్నారు" నాయుడు. ఇసుక కొరతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బాబు చెప్పారు. ఇసుక కొరత కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు చంద్రబాబు.
ఇక మరోవైపు...లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయడానికి జన సైనికులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జన సైనికులు తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇసుక కొరతను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు.