మీకు సొంతిల్లు ఉందా..? అద్దె ఇంట్లో ఉంటున్నారా..ఇలా 34 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే

By సుభాష్  Published on  28 Dec 2019 6:52 AM GMT
మీకు సొంతిల్లు ఉందా..? అద్దె ఇంట్లో ఉంటున్నారా..ఇలా 34 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే

మీకు సొంత ఇల్లు ఉందా..లేదా అద్దె ఇంట్లో నివసిస్తున్నారా..? లేక మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు..? ఇంట్లో ఎంత మందికి బ్యాంకు ఖాతాలు, భూములు ఉన్నాయి .. అనే మొత్తం 34 ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు రెడీగా ఉండండి. ఎందుకంటే 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ లోగా జనగణన చేపట్టనుంది కేంద్ర సర్కార్‌. ప్రతి కుటుంబం నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు సిద్దమవుతోంది జనగణన శాఖ. జనగనణలో భాగంగా మీరు నిర్మించిన ఇండ్లు, అందులో ఎంత మంది నివసిస్తున్నారు. ఏ గదిని ఎందుకోసం వాడుతున్నారు..? ఇలాంటి ప్రశ్నలు మీకు సంధించనున్నారు అధికారులు. మీరు చెప్పే వివరాలే ప్రభుత్వ పథకాల అమలుకు ఉపయోగపడనున్నాయి.

ప్రతి కుటుంబానికి జనగణన అధికారులు అడిగే ప్రశ్నలివే..

  • మీరు ఎన్ని భవనాలు నిర్మించారు..? ఏ భవనం ఎందు కోసం ఉపయోగిస్తున్నారు.
  • ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి, వంటగదులు ఎన్ని నిర్మించారు, అలాగే మరుగుదొడ్లు, బెడ్‌ రూంలు ఎన్ని నిర్మించారు.
  • ఇంట్లో ఎంత మంది దంపతులున్నారు?. పిల్లలు ఎంత మంది ఉన్నారు?
  • మీకు సొంత ఇల్లు ఉందా..? లేదా అద్దె ఇంట్లో ఉంఉన్నారా..? మీకు సొంత ఇల్లు ఎందుకు లేదు.
  • మీరు తాగేందుకు నీరు ఫిల్టర్‌ వాటర్‌ తెచ్చుకుంటున్నారా..? లేదా ప్రభుత్వ కుళాయి నీరు తాగుతున్నారా..? నీటిని ఎంత దూరం నుంచి తీసుకువస్తున్నారు.? అసలు మీరుండే ప్రాంతంలో నీటి సౌకర్యం ఉందా..? లేదా.?
  • మీరు ఇల్లు నిర్మించుకున్నట్లయితే అది సిమెంట్‌ తోనిర్మించి ఉందా..? లేదా పెంకుటిళ్లు నిర్మించుకున్నారా..? మీ ఇల్లుకు ఎంత ఖర్చు అయింది.
  • మీరు నిర్మించిన మరుగుదొడ్డి డ్రైనేజికి అనుసంధానం చేశారా.? లేక సెప్టింగ్‌ ట్యాంకు నిర్మించుకున్నారా? దానిని శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నారా..?
  • మీ ఇంట్లో వంట చేసేందుకు ఎల్పీజీ కనెక్షన్‌ ఉందా..?లేదా..? లేకపోతే ఎందుకు లేదు. అలాగే కిరోసిన్‌తో వంట చేసుకుంటున్నారా? లేదా కరెంటు పొయ్యి మీద వంట చేసుకుంటున్నారా?
  • మీ ఇంట్లో ల్యాండ్‌ ఫోన్‌ ఉందా..? సెల్‌ఫోన్‌ ఉందా..?
  • మీకు సైకిల్‌, బైక్‌, కారు, ఇతర వాహనాలు ఏమైన ఉన్నాయా..?
  • ఈ ఫ్యామిలీలో ఎంత మందికి బ్యాంఖ అకౌంట్లు ఉన్నాయి..?
  • మీ కుటుంబంలో ఉన్నవారందరూ ఏఏ పనులు చేస్తున్నారు..? ప్రైవేటు ఉద్యోగం చేస్తారా..? లేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా..? లేకపోతే ఏదైన వ్యాపారం చేసుకుంటారా..? ఒక వేళ జాబ్‌ గానీ, వ్యాపారం గానీ చేసుకుంటే నెలకు ఎంత ఆదాయం వస్తుంది?
  • మీ కుటుంబంలో కూలీ పనులు చేసే వారున్నారా..?
  • మీకు భూములు, ఆస్తులు ఎన్ని ఉన్నాయి..?
  • మీ కుటుంబానికి నెలకు ఎంత ఆదాయం వస్తుంది.?
  • అలాగే మీ కుటుంబంలో ఉన్న పెద్ద ఫోన్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలా మీ ఇంటికి వచ్చిన అధికారులు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానాలు చెప్పేందుకు రెడీగా ఉండండి. మీరు చెప్పే సమాధానాల మీదే మీకు ప్రభుత్వ పథకాలు అమలుకు కీలకంగా మారనున్నాయి.

Next Story