'జ‌న‌సేన' రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 8:08 AM GMT
జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్య‌వ‌స‌ర స‌మావేశ‌మైంది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించారు.

అలాగే ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబు, తోట చంద్రశేఖర్ (పార్టీ ప్రధాన కార్యదర్శి), కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, మనుక్రాంత్ రెడ్డి, బి.నాయకర్, డా.పసుపులేటి హరిప్రసాద్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, చిలకం మధుసూదన్ రెడ్డి, బి.శ్రీనివాసయాదవ్, ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

Janasena2

ఈ స‌మావేశంలోప‌లు అంశాల‌పై చ‌ర్చ కొన‌సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా నెలకొన్న సంక్షోభిత పరిస్థితులు, ఇసుక వారోత్సవాలు చేసినా ఇప్పటికీ ఇసుక పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, అక్రమ తరలింపు అంశాలపై క‌మిటీ చ‌ర్చించ‌నుంది. అలాగే విశాఖ లాంగ్ మార్చ్ అనంతర పరిస్థితిపై సమీక్షించ‌నున్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో పాలకవర్గం అలక్ష్యంగా ఉండటం, జలవనరులను సంరక్షించుకోవడంలో వైఫల్యం, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన చ‌ర్చ కొన‌సాగ‌నుంది. తెలుగు మాధ్యమ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడంపై, 'మన నుడి, మన నది' కార్యక్రమ నిర్వహణపై కూడా చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై దిశానిర్దేశం చేయ‌నున్నారు.

Janasena3

Next Story