గాంధీ వర్థంతి రోజే ఢిల్లీలో కాల్పుల కలకలం

By సుభాష్  Published on  30 Jan 2020 11:03 AM GMT
గాంధీ వర్థంతి రోజే ఢిల్లీలో కాల్పుల కలకలం

మహాత్మగాంధీ వర్థంతి రోజే ఢిల్లీలో ఓ ఉన్మాది కాల్పులతో రెచ్చిపోయాడు. సీఏఏకి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నవిద్యార్థులపై దుండగులు కాల్పలకు తెగబడ్డాడు. దీంతో జామియా ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అజాదీ కావాలా అంటూ దుండగుడు ఆందోళనకారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయాపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో జనాలు భయాందోళన చెంది పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లీంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దుండగుడు నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను.. ఎవరికి కావాలి ఆజాదీ.. జై శ్రీరాం అంటూ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Jamia Firing

కాగా, షాహీన్ బాగ్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై బుధవారం తుపాకీ మహ్మద్‌ లుఖ్మాన్‌ అనే వ్యక్తి బెదిరించిన సంగతి తెలిసిందే. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోసారి తుపాకీతో కాల్పులకు పాల్పడుతూ హల్‌చల్‌ కావడంతో ఆందోళనకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈరోజు గాంధీ వర్థంతి సందర్భంగా వందలాది మహిళలు వర్థంతిని పురస్కరించుకుని శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాగా, జామియా మిలియా ఇస్లామియా నుంచి గాంధీ స్మారక చిహ్నం రాజ్‌ఘాట్‌ వరకు చేపట్టే పాదయాత్రను పోలీసులు అనుమతి నిరాకరించారు.Next Story
Share it