నేడు సీఎం జగన్ విశాఖలో పర్యటన
By సుభాష్Published on : 28 Dec 2019 9:41 AM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు బయలుదేరుతారు. 3.30గంటలకు కైలాసగిరి వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు వైఎస్సార్ సెంట్రల్‌పార్క్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్కేబీచ్ వద్ద విశాఖ ఉత్సవ్ ప్రారంభించనున్నారు. అలాగే రాత్రి 7.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story