ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట పార్టీలోకి చేరిన నేతలకు కీలక పదవీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, రామరాజు, ఆయన సోదరుడు కొన్ని రోజుల కిందట జగన్‌ సమక్షంలో పార్టీలో చేరగా, సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, వీరికి జగన్‌ ఏదో ఒక పదవీ కేటాయిస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు నరసాపురంలో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న రఘురామకృష్ణంకు చెక్‌పెట్టేందుకే పార్టీ నేతలు వారిని వైసీపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. భవిష్యత్తులో వీరికి ఎంపీ సీటు కూడా కేటాయించే అవకాశాలున్నాయని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన నేతలకు ఏదో ఒక విధంగా పదవులు కల్పించాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపొందిన ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు దక్కాలనే ఉద్దేశంతో కొందరికి రెండున్న సంవత్సరాల పాటు మంత్రి పదవి ఇచ్చి, మిగిలిన వారందరికి మరో రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవులు కేటాయించనున్నారు. పార్టీలోకి వచ్చిన నేతలలందరికి ఎక్కడో ఒక చోటు చిన్న పదవైనా ఇవ్వాలని జగన్‌ ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సుభాష్

.

Next Story