ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసేవ నిమిత్తం  రాష్ట్ర మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని జగన్ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు, అర్జీదారుల కొరకు ప్రతీ బుధవారం సచివాలయంలో మంత్రులంతా తప్పకుండా హాజరు కావాలని జగన్‌ ఆదేశించారు.

గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రతి మంగళ, బుధవారాల్లో విధిగా సచివాలయానికి రావాలని జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, దూరభావం, సంక్షేమ పథకాల కారణంగా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ వారంలో ఒక రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.