సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
By సుభాష్Published on : 28 Feb 2020 12:18 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసేవ నిమిత్తం రాష్ట్ర మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు, అర్జీదారుల కొరకు ప్రతీ బుధవారం సచివాలయంలో మంత్రులంతా తప్పకుండా హాజరు కావాలని జగన్ ఆదేశించారు.
గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రతి మంగళ, బుధవారాల్లో విధిగా సచివాలయానికి రావాలని జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, దూరభావం, సంక్షేమ పథకాల కారణంగా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ వారంలో ఒక రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story