విశాఖ న‌గ‌రంలోని గోపాల‌ప‌ట్నం ప‌రిధి ఆర్‌.ఆర్ వెంక‌టాపురంలోని ఎల్‌.జి పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ నుంచి తెల్ల‌వారు జామున ర‌సాయ‌న వాయువు లీక్ కావ‌డంతో ముగ్గురు మృతి చెంద‌గా.. 200 మందికి పైగా అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండ‌డంతో.. ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌ల‌ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్పందించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *