విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన సీఎం జగన్
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 8:01 AM ISTవిశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్ వెంకటాపురంలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి తెల్లవారు జామున రసాయన వాయువు లీక్ కావడంతో ముగ్గురు మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురైయ్యారు. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Next Story