నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్‌

By సుభాష్
Published on : 14 Feb 2020 9:15 AM IST

నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం మళ్లీ ఢిల్లీకి పయనం కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 12న ఢిల్లీ వెళ్లిన జగన్‌ ప్రధాని నరేంద్రమోదీతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ మోదీని లేఖ అందించారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఏపీకి ప్రత్యేక హోదా, అభివృద్ధి పనులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మోదీతో చర్చించారు.

అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితులపై కూడా చర్చించారు. విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రానికి తగిన నిధులు అందించాలని మోదీని కోరారు. అందుకు మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Next Story