జబర్దస్త్ దొరబాబు విషయంలో హైపర్ ఆది సంచలన నిర్ణయం..!
By సుభాష్ Published on 7 March 2020 9:12 AM ISTమంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క నిమిషం చాలు. జబర్దస్ట్ లో కమెడియన్లు దొరబాబు, పరదేశీ విషయంలో అదే జరిగిందనే చెప్పాలి. మూడు రోజుల కిందట విశాఖపట్టణంలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. తీరా పోలీసుల కాళ్లవేళ్లా పడ్డా కూడా ఫలితంలేకుండా పోయింది. బుల్లితెర షోపై మంచి పేరున్న దొరబాబు, పరదేశీలకు ఒక్కసారిగా ఇమేజ్ దెబ్బతింది.
నిజంగానే వీళ్లు అలాంటి వాళ్లేనని ముద్రపడిపోయింది. జనాలు సైతం ఛీకొడుతున్నారు. కాగా, వీళ్లున్న టీమ్ లీడర్ హైపర్ ఆది కూడా ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ప్రస్తుతానికి వినిపిస్తున్న ప్రచారం ప్రకారం చూస్తే.. మరో రెండు వారాల పాటు దొరబాబు కనిపించడు. ఆయనతో పాటు పరదేశీది కూడా అదే పరిస్థితి. పరదేశీ ఆది రాసే స్కిట్ లలో రైటర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి లేడు. సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటే అడ్డంగా దొరికి లైఫ్ అంతా నాశనం చేసుకున్నాడు.
ఇదిలాఉండగా దొరబాబు కూడా అంతకు ముందు బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు. హైపర్ ఆది కూడా గతంలో దొరబాబు నటించిన పలు షార్ట్ ఫిలిమ్స్‌లను ఆధారంగా చేసుకుని తన స్కిట్‌లో కామెడీ పండించడం చేసేవాడని తెలుస్తోంది. వీరిద్దరూ చేసిన ఘనకార్యానికి మల్లెమాల ప్రొడక్షన్స్ సీరియర్‌గానే స్పందించినట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరిని హైపర్ ఆది టీమ్ నుంచి తీసేస్తాడా..? లేక అలాగే కంటిన్యూ చేస్తాడా అన్నది చూడాల్సిందే.