విజయ్ కొంపముంచిన బిగిల్

By రాణి  Published on  6 Feb 2020 5:55 AM GMT
విజయ్ కొంపముంచిన బిగిల్

బుధవారం సాయంత్రం మాస్టర్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఐటీ అధికారులు హీరో విజయ్ ను ఐదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నైవేలి నుంచి నుంచి ఆయన్ను చెన్నైకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బిగిల్ ను నైవేలి నుంచి చెన్నైకి తీసుకురావడంతో మాస్టర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా..గతేడాది విడుదలైన బిగిల్ సినిమా కు సంబంధించి విజయ్ ఇళ్లతో పాటు..సినిమాను తెరకెక్కించిన ఏజీఎస్ సంస్థ కార్యాలయాలు, సంస్థలోని వ్యక్తులకు చెందిన ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. కాగా..బిగిల్ సినిమా ను రూ.180 కోట్లతో నిర్మించినట్లు ఏజీఎస్ చెప్తుండగా..సినిమా బడ్జెట్ మొత్తం రూ.220 కోట్లు అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తమిళనాడులోనే రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు సంపాదించింది. వచ్చిన ఆదాయానికి పన్ను చెల్లించకుండా సదరు నిర్మాణ సంస్థ పన్ను ఎగ్గొట్టిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే సోదాలు చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.

బిగిల్ సినిమాకి హీరో విజయ్ రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏజీఎస్ కు ఫైనాన్స్ అందించిన నిర్మాత అన్బుచెళియన్ కు చెందిన సంస్థలు, మధురైలోని ఆయన నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. చెన్నైలోని సాలిగ్రామం, నీలాంగరైల్లో ఉన్న విజయ్ ఇళ్లలో తనిఖీలు చేశారు. బిగిల్ ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏజీఎస్ సంస్థ సహా అన్బుచెళియన్ కు చెందిన 20 సంస్థల్లో చేసిన తనిఖీల్లో రూ.25 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.

Next Story