ముక్కలైన విమానం..
By అంజి Published on 6 Feb 2020 8:25 AM ISTటర్కీలోని ఇస్తాంబుల్లో విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం.. రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి పడిపోయింది. అనంతరం ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సబీహా గోకెన్ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానం పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు.
విమానం కిందపడిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని తెలుస్తోంది. లేనిపక్షంలో భారీగా ప్రాణ నష్టం జరిగేదని అధికారులు అభిప్రాయపడ్డారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పిన అధికారులు. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విరిగిపోయిన విమాన భాగాల నుంచి సైతం ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టినట్టు సమాచారం. దీంతో ఆ విమానాశ్రయానికి విమానాల రాకను నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు.