అంతరిక్షంలో పంట సాగు.. వ్యోమగాములకు పండగే..!
By అంజి
ముఖ్యాంశాలు
- ఐఎస్‌ఎస్‌లో పండిన ఆకుకూర (లెటుస్)
- మానవ సహిత యాత్రలకు సన్నాహాలు
- అంతరిక్షంలోనే పంటలు పండించుకోనున్న వ్యోమగాములు
'వ్యోమగాముల పంట పండింది.!' అంటూ ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం మేరకు.. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో ప్రయోగాత్మకంగా ఆకుకూరను సాగు చేశారు. అంతరిక్షంలో పండించిన ఆకుకూరలో.. భూమి మీద పండించిన ఆకుకూరలో ఉండే పోషక విలువలే ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. దీంతో అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములకు తమకు కావాల్సిన తాజా ఆహారాన్ని పండించుకోవడానికి మార్గం లభించింది.
తాజాగా అంతరిక్షంలో పండించిన లెటుస్ తినడానికి పూర్తిగా సురక్షితమైనదని శ్రాస్తవేత్తలు వివరించారు. రెడ్ రొమైన్ లెటుస్‌లో ఎలాంటి వ్యాధి కారక సూక్ష్మజీవులు లేవన్నారు. రేడియోధార్మికత అధికంగా, గురుత్వాకర్షణన శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఆకుకూర పండింది. అయితే వీటిలో ఏ మాత్రం పోషక విలువలు తగ్గలేదని అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తెలిపింది.
Also Read:
నీకోసమే నా అన్వేషణ.. నిన్ను చేరే క్షణం కోసం.. ఎంతదూరమైనా..
సాధారణంగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు.. భూమి నుంచి ప్రాసెస్డ్, ప్రీప్యాకేజ్జ్ ఆహారం పంపుతుంటారు. అయితే తాజా ఆహారం వల్ల వారికి అదనంగా పోటాషియంతో పాటు కె, బి1, సి విటమిన్లు లభిస్తాయి. దీనికి తోడుగా ప్రీ ప్యాకేజ్డ్ ఆహారంలో తక్కువ ఉండే పోషకాలు అందుతాయి. ఇప్పటికే అంతరిక్ష సంస్థలు మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. 2024 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు మానవుడిని పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అటున్నుంచి అంగారకుడి (మార్స్) మీదకు వ్యోమగాములను పంపనున్నారు. అయితే ఈ ప్రయాణంలో వారికి వ్యోమనౌకలోనే పంటలను పండించుకొని తినడం ప్రయోజనకారిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇంటర్నేషన్ స్పెస్ సెంటర్‌లో 2014 నుంచి 2016 మధ్య కాలంలో ఈ ఆకుకూరను పండించారు. ఐఎస్‌ఎస్‌లోని వెజ్జీ అనే ఒక ప్రత్యేక చాంచర్‌లో దీన్ని సాగు చేశారు. ఈ చాంబర్‌లో ఎల్‌ఈడీ దీపాలు, నీటి సరఫరా వ్యవస్థ ఉంటుంది. పండిన ఆకుకూరలను వ్యోమగాములు తిన్నారు. అయితే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.