టీమిండియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో బంగ్లాదేశ్ ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో అదే రీతిన సాగుతుంది. శనివారం రెండో రోజు ఆటలో భాగంగా బంగ్లా తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించంది. అయితే.. తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

బంగ్లా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన‌ కాసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. మొద‌టి ఇన్నింగ్సులొ 5వికెట్లు ప‌డ‌గొట్టిన‌ ఇషాంత్‌ శర్మ.. నిప్పులు చెరిగే బంతులతో తొలి రెండు వికెట్లను త‌న‌ ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లామ్‌, మోమినుల్‌ హక్‌లను పెవిలియన్‌కు పంపాడు. రెండో ఇన్నింగ్సులోనూ ఇషాంత్ 4వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఆ తర్వాత కూడా.. మహ్మద్‌ మిథున్‌(6), ఇమ్రుల్‌ కేయిస్‌(5)లు కూడా త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్ చేరడంతో బంగ్లాదేశ్‌ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ ఐదు వికెట్లతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.