కరోనా వ్యాక్సిన్ తయారవుతుందా..? ఇంకెన్ని రోజులు ఆగాలి?
By Newsmeter.Network Published on 16 March 2020 9:18 AM IST
కరోనా.. ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దాదాపు 145 దేశాల్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ భారినపడి లక్షన్నర మంది వరకు చికిత్సలు పొందుతుండగా 5,800లకు పైగా కరోనా భారిన పడి మృతి చెందారు. భారత్‌లోనూ ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 110 దాటింది. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్‌లను బంద్ చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ ( కొవిడ్ -19)ను అరికట్టేందుకు, ఈవైరస్ భారి నుండి మానవాళిని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిలో భాగం గా రూపొందిం చిన ఓ వ్యాక్సిన్‌ను నేడు తొలిసారి ప్రయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధి కారి తెలిపినట్లు తెలుస్తోంది. నేడు ఓ వ్యక్తిపై క్లినికల్ ట్రయ ల్స్ ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే దీన్ని అక్కడి ప్రభుత్వం కానీ, సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 45మంది యువకులపై ఈ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో పరిమాణంలో వ్యాక్సిన్‌ను ఇస్తారు.
అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు పేర్కొన్నట్లు తెలు స్తుంది. మరిన్ని లోతైన పరీక్షలు చేయడానికి ముందుచేసే ప్రయోగం మాత్రమేనని పేర్కొన్నారు. తద్వారా మున్ముందు ఏమైనా దుష్పరిణామా లు ఉంటాయేమోనని తెలుసుకునే అవకాశం కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాక్సి న్ పనితీరును పూర్తిస్థాయిలో ధృవపర్చడానికి మాత్రం మరో 18నెలలు వేచి చూడక తప్పదని అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు తెలిపారు.