త‌రుణ్ భాస్క‌ర్ ఆ ప‌ని కూడా చేస్తున్నాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 8:39 AM GMT
త‌రుణ్ భాస్క‌ర్ ఆ ప‌ని కూడా చేస్తున్నాడా..?

'పెళ్లి చూపులు' సినిమాతో బాగా పాపుల‌ర్ అయిన టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్‌లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ఈ యువ ద‌ర్శ‌కుడితో సినిమాలు చేసేందుకు బ‌డా నిర్మాత‌లు, బ‌డా హీరోలు ఇంట్ర‌స్ట్ చూపించారు. అయిన‌ప్ప‌టికీ చిన్న హీరోల‌తోనే ఇంకా చెప్పాలంటే కొత్తవాళ్ల‌తోనే మ‌రో సినిమా చేశాడు. అదే.. ఈ న‌గ‌రానికి ఏమైంది..?

ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేదు కానీ.. క‌లెక్ష‌న్స్ ప‌రంగా పర‌వాలేదు అనిపించింది. ఆ త‌ర్వాత వెంకీతో సినిమా చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. వెంకీ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. 'మీకు మాత్ర‌మే చెప్తా' అనే సినిమాలో హీరోగా న‌టించాడు. ఇదిలా ఉంటే.. సాయి రొనాక్‌, ప్రీతి అష్రాని జంటగా నటిస్తున్న చిత్రం ప్రెజర్‌ కుక్కర్. కరంపూరి క్రియేషన్స్‌ అండ్‌ మిక్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుజై, సుశీల్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ ప్రెజర్‌ కుక్కర్ సినిమా ఫస్ట్‌ లుక్‌‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్తగ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే హీరోగా మారిన తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం ఎడిటర్‌గా మారుతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తరుణ్ భాస్కర్ కట్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఈ చిత్ర టీజర్‌ను ఎందుకు కట్ చేయాలని అనిపించిందో తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇంకా అతనితో పాటు అతని పెంపుడు కుక్క కూడా ఈ టీజర్ ఎడిట్‌లో భాగమవుతుందని, టీజర్ నచ్చితే అందరూ షేర్ చేసి లైక్ చేయమని తరుణ్ ఈ వీడియోలో తెలిపారు. మ‌రి.. త‌రుణ్ భాస్క‌ర్ ఎడిట‌ర్‌గా క‌ట్ చేసిన టీజ‌ర్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story
Share it