'మైకేల్ జాక్సన్' బతికే ఉన్నాడా?

By రాణి  Published on  26 Dec 2019 1:04 PM GMT
మైకేల్ జాక్సన్ బతికే ఉన్నాడా?

ముఖ్యాంశాలు

  • ముమ్మూర్తులా మైకేల్ జాక్సన్ ని పోలిఉన్న వ్యక్తి
  • స్పెయిన్ దేశానికి చెందిన సెర్జియో కోర్టెస్
  • సోషన్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన సెర్జియో
  • పాప్ కింగ్ బతికే ఉన్నాడని భావిస్తున్న అభిమానులు
  • డిఎన్ఎ పరీక్షతో నిజాన్ని నిరూపించాలని డిమాండ్
  • పట్టాయాలో మైకేల్ లుక్ ఎలైక్ పాప్ షో
  • డిసెంబర్ 23న పట్టాయాలో జరిగిన పాప్ షో
  • షోకి హాజరు కావాలని మైకేల్ అభిమానులకు విజ్ఞప్తి

మైకేల్ జాక్సన్ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఇంకా అనుమానాలు ఉండనే ఉన్నాయి. 2009లో పాప్ కింగ్ మరణించిన సత్యాన్ని ప్రపంచానికి మీడియా, అధికారిక వర్గాలు వెల్లడించిన తర్వాత కూడా అభిమానులకు ఇంకా మైకేల్ బతికే ఉండి ఉంటాడన్న ఆశ చావలేదు. ఇప్పుడీ ఆలోచనలకు కొత్త ఊహల్ని జోడిస్తూ అచ్చంగా మైకేల్ లా ఉన్న ఓ వ్యక్తి లైవ్ వీడియో సోషన్ నెట్వర్క్ లో హల్ చల్ చేస్తోంది. ఎవరా వ్యక్తి? ఏమా కథ?

మైకేల్ జాక్సన్ లా కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించి నెట్ లో చక్కర్లు కొడుతున్న లైవ్ ఫుటేజ్ నిజంగానే మైకేల్ జాక్సన్ దే అని పాప్ కింగ్ ఫ్యాన్స్ బలంగా భావిస్తున్నారు. మైకేల్ జాక్సన్ 2009లో చనిపోయాడు. కానీ తను ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా గుప్తంగా బతుకుతున్నాడని కొన్ని రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో అచ్చంగా మైకేల్ జాక్సన్ ని పోలిన ఓ స్పెయిన్ జాతీయుడు సెర్గియో కోర్టెస్ విజువల్స్ నెట్ లో వైరల్ అయ్యాయి. ముమ్మూర్తులా మైకేల్ జాక్సన్ ని పోలిఉన్న సెర్గియా తను నిజంగా మైకేల్ కాదని నిరూపించుకోవడానికి డి.ఎన్.ఎ టెస్ట్ చేయించుకోవాలని పాప్ కింగ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే తనే నిజంగా మైకేల్ జాక్సన్ అన్న నిజం కూడా బయట పడుతుందంటూ మరికొందరు అభిమానులు సోషల్ నెట్ వర్క్ లో కామెంట్లు చేస్తున్నారు.

థాయ్ ల్యాండ్ లో ఓ కొత్త పాప్ సంబరానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ సెర్గియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఈ కలకలానికి కారణం అయ్యింది. సెర్గియో కేవలం చూడడానికి మాత్రమే మైకేల్ లా లేడనీ, తన గొంతుక, హావభావాలు, మాట్లాడే విధానంకూడా అచ్చంగా అలాగే ఉందనీ పాప్ కింగ్ అభిమానులు అంటున్నారు. డిసెంబర్ 23వ తేదీన పట్టాయా నగరంలో తాను ఇవ్వబోయే ప్రదర్శనను చూసేందుకు మైకేల్ జాక్సన్ అభిమానులందరూ తరలిరావాలని సెర్గియో ఆ వీడియోలో అప్పీల్ చేశాడు. కానీ విమర్శకులు మాత్రం సెర్గియో మైకేల్ జాక్సన్ కాడనీ, పాప్ కింగ్ కూ, తనకూ మధ్య మాటల్లోనూ, యాసలోనూ, భాషలోనూ చాలా వ్యత్యాసం ఉందనీ అంటున్నారు. పైగా సెర్గియో వయసులో కూడా చాలా చిన్నవాడిగా కనపడుతున్నారంటున్నారు. స్వయంగా సెర్గియో మాత్రం తను నిజంగానే మైకేల్ ని కాదనీ, కేవలం అతని రూపు రేఖల్లో ఉన్నందువల్లే తనకు ఇంత ప్రాచుర్యం లభిస్తోందనీ చెబుతున్నాడు. కిందటి నెల కేవలం తను మైకేల్ రూపురేఖల్లో ఉన్నకారణంగా ఒక యాడ్స్ కంపెనీ ఒక పెర్ ఫ్యూమ్ అడ్వర్టైజ్ మెంట్ కోసం తనను ఉపయోగించుకుందనీ, తనకు ఎంతో ఇష్టమైన రంగంలో రాణించేందుకు తన రూపు రేఖలు ఎంతగానో సాయం చేస్తున్నాయనీ చెబుతున్నాడు.

Next Story