టీమిండియా క్రికెట‌ర్ ఇర్ఫాన్‌ పఠాన్‌.. నిన్న ఆందోళ‌న‌లో పాల్గొన్న‌ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. ‘పౌరసత్వ సవరణ చట్టం’ను వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళ‌నలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో.. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి మ‌మ్మ‌ల్ని చితకబాదార‌ని విద్యార్థులు ఆరోపించారు.

ఈ విష‌య‌మై ఇర్ఫాన్ ప‌ఠాన్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. రాజకీయంగా నిందలు, ఆరోపణలు ఎప్పుడూ ఉంటాయి. కానీ విద్యార్థుల పరిస్థితిపై ఇప్పుడు యావ‌త్తు దేశం, నేను ఆందోళనకు గుర‌వుతున్నామ‌ని ట్వీట్ చేశారు. ట్వీట్‌కు.. జామియా మిలియా, జామియా ప్రొటెస్ట్‌ అనే ట్యాగ్‌లు జత‌చేశారు.

ఇదిలావుంటే కేంద్ర ప్ర‌భుత్వం.. ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ప‌లుచోట నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. నిన్న డిల్లీలో జ‌రిగిన‌ ఆందోళనల్లో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.