రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌.. టికెట్ల బుకింగ్‌లో కొత్త విధానం

By సుభాష్  Published on  8 Nov 2020 4:21 AM GMT
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌.. టికెట్ల బుకింగ్‌లో కొత్త విధానం

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ఐఆర్‌టీసీ టికెట్‌ బుకింగ్‌కు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు సెకండ్‌ రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం అవుతుందని రైల్వే వెల్లడించింది. దీంతో ప్రయాణికులు మిగిలివున్న సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా, ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టం ద్వారా గానీ పొందవచ్చని తెలిపింది. ఈ కొత్త మార్పులు చివరి నిమిషంలో ప్రయాణించేవారికి ఎంతగానో ఉపయోగపడనుంది. కాగా, కరోనా వైరస్‌ సమయంలో రిజర్వేషన్‌ చార్ట్‌ను రైలు బయలుదేరే రెండు గంటల ముందు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే గతంలో లాగానే రైలు ప్రారంభమయయే అరగంట ముందు సెకండ్‌ రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం చేయాలని ప్రయాణికుల నుంచి, జోనల్‌ కార్యాలయాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో మొదటి చార్ట్‌ను రైలు ప్రారంభమయయే కంటే నాలుగు గంటల ముందు, రెండో చార్ట్‌ను రైలు ప్రారంభమయ్యే అరగంట నుంచి ఐదు నిమిషాల మధ్య సిద్ధం చేస్తామని రైల్వే ప్రకటించింది. అయితే తాజా నిర్ణయంతో సెకండ్‌ చార్ట్‌ సిద్ధమయ్యే సమయంలో కూడా ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకుని రిఫండ్‌ పొందవచ్చని రైల్వే వెల్లడించింది. ఈ మంగళవారం నుంచి ఈ కొత్త నిబంధన లు అమల్లోకి రానున్నాయి. అలాగే సెకండ్‌ చార్ట్‌ సిద్ధం అయ్యేకంటే ముందు టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.

Next Story