మహిళా ఐఏఎస్‌ అధికారిణి నివాసంపై ఏసీబీ దాడులు

By సుభాష్  Published on  7 Nov 2020 1:59 PM GMT
మహిళా ఐఏఎస్‌ అధికారిణి నివాసంపై ఏసీబీ దాడులు

కర్ణాటక మహిళా ఐఏఎస్‌ అధికారిణి ఇంటిపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కర్ణాటకలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బయోటెక్నాలజీ శాఖలో ఆఫీసర్‌గా పని చేస్తున్న సుధ ఇంట్లో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు నగదు, బంగారు అభరణాలు భారీగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సదరు ఐఏఎస్‌ అధికారిని అక్రమంగా సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులకు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంగళూరు డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆమె గతంలో ల్యాండ్‌ అక్విజిషన్‌ ఆఫీసర్‌గా పని చేశారు. ప్రస్తుతం సుధ బయోటెక్నాలజీ డిపార్టు మెంట్‌లో అడ్మినిస్ట్రేటీవ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సుధ అవినీతికి సంబంధించి లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. సుధ భర్త శాండల్‌వుడ్‌లో సినీ నిర్మాత, అక్రమంగా సంపాదించిన డబ్బుతో సుధ భర్త సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

2015లోనూ ఆమె నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. దాడుల్లో పెద్ద మొత్తంలో బంగారం, 10 లక్షల నగదు, ఖరీదైన ఎస్‌యూవీ కారును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని డాక్యుమెంట్లను సైతం సీజ్‌ చేశారు. అయితే అధికారిణి సుధ లంచం రూపంలో బంగారం, వాహనాలను తీసుకున్నట్లు తేలింది. లెక్క తేలని కోటి రూపాయల నగదు, ఐదు విలాసవంతమైన బంగళాలు, పెదద్ మొత్తంలో గుర్తించినట్లు, ఆమె ఆదాయానికి మించినవేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

అలాగే బెంగళూరు నగర శివారులలో లే అవుట్లు వెలుస్తున్న సమయంలో వ్యవసాయ భూములను రెసిడెన్షియల్‌గా మార్చడానికి పెద్ద ఎత్తున స్వీకరించినట్లు ఏసీబీ విచారణ తేలినట్లు తెలుస్తోంది. ఆమెపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story