మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీక్‌..  19 మంది మృతి

By సుభాష్  Published on  1 July 2020 3:25 AM GMT
మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీక్‌..  19 మంది మృతి

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీకై భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు టెహ్రాన్‌ డిప్యూటీ గవర్నర్‌ హమీద్‌ రెజా తెలిపారు. మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీక్‌ కావడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. కాగా, మెడికల్‌ క్లినిక్‌లో పేలుడు జరిగిన సమయంలో 25 మంది ఉద్యోగులున్నారని, గాయపడిన వారిని చికిత్స నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. మృతుల్లో 15 మంది వరకు మహిళలున్నట్లు డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. ప్రమాదం కారణంగా ఆస్తినష్టం కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.

Next Story