హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌?

By సుభాష్  Published on  1 July 2020 2:42 AM GMT
హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌ జీహెచ్ ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యం మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రేపు జరిగే తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించనుంది ప్రభుత్వం. ఈ లాక్ డౌన్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది.

హైదరాబాద్‌ నగరంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నారా..? ఇంతకు ముందుకంటే ఇప్పుడు కాస్త కఠినంగానే ఉంటుందా..? అంటే అవుననే సమాధానం వార్తలు వస్తున్నాయి. జూలై 3 నుంచి హైదరాబాద్‌ నగరంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

గతంలో కంటి మరింత కఠినంగా లాక్‌డౌన్‌

కాగా, గతంలో ఉన్న లాక్‌డౌన్‌ కంటే ఈ సారి విధించే లాక్‌డౌన్‌ కఠినంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే నిత్యావసర సరుకుల దుకాణాలు , మెడికల్‌ షాపులు మినహా అన్ని షాపులు మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్ విధించే సరైన నిర్ణయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు విఫలమయ్యారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు చెబుతున్నారు.

రాత్రి 7నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ

అలాగే కరోనా కట్టడికి అధికారులు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధింపు, వైన్స్‌ షాపులు సైతం బంద్‌ కానున్నాయి. స్టాంప్స్‌, అండ్‌ రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ కార్యాలయాలను తెరిచి ఉంచే విషయం కూడా పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఐటీ కార్యాలయాలు ఇప్పటికే 50శాతం ఉద్యోగులతో పని చేస్తున్నాయి. కొత్తగా విడుదలయ్యే మార్గదర్శకాలు మునుపటి కంటే కఠినంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో లాక్‌డౌన్ విధించడమే శరణ్యంగా మారింది. హైదరాబాద్‌లో ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు.

Next Story