ఏఏ ఛానల్స్‌లో ఐపీఎల్ ప్రసారం కానుందంటే..?
By తోట వంశీ కుమార్ Published on 19 Sept 2020 4:31 PM ISTక్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అబుదాబి వేదికగా నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మన దేశంలో కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో.. యూఏఈ వేదికగా ఈ ఏడాది సీజన్‌ను నిర్వహించనున్నారు. మొత్తం 53 రోజుల పాటు ఈ మెగా టోర్నీ కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ప్రతి రోజు రాత్రి 7.30గంటలకు ప్రారంభం అవుతున్నాయి. ఇక డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు సాయంత్రం మ్యాచ్‌లు 3.30గంటలకు ప్రారంభం అవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.
ఈ టోర్నీ లైవ్ టెలికాస్ట్ ఏయే చానళ్లలో రానుందో ఓ సారి చూద్దాం..
ఇంగ్లీష్ టెలికాస్ట్:
స్టార్ స్పోర్ట్స్ 1
స్టార్ స్పోర్ట్స్ 2
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2
తెలుగు:
మా మూవీస్
హిందీ:
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ
డీడీ నేషనల్
ఆన్ లైన్ బ్రాడ్ కాస్టింగ్ (ఓటీటీ ప్లాట్ ఫామ్):
హాట్ స్టార్
జియో టీవీ
రెడ్ బాక్స్ టీవీ.
విదేశాల్లో..
బంగ్లాదేశ్ : ఛానల్ 9
బ్రూనై మరియు మలేషియా: ఆస్ట్రో
కరేబియన్: స్పోర్ట్స్ మాక్స్
హాంకాంగ్: పిసిసిడబ్ల్యు
యుఎఇ మరియు సౌదీ అరేబియా: బీన్ స్పోర్ట్స్
న్యూజిలాండ్: స్కై స్పోర్ట్
యునైటెడ్ కింగ్‌డమ్: స్కై స్పోర్ట్స్
యుఎస్: విల్లో
శ్రీలంక, నేపాల్ మరియు భూటాన్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్