ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా ఐపీఎల్‌కు పేరుంది. ఈ టోర్నమెంట్‌ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అయితే తాజాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అనుహ్య మార్పులు తీసుకొచ్చేందుకు ఐపీఎల్‌ నిర్వాహక సంఘం కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్‌ 2020 లీగ్‌లో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. పొట్టి క్రికెట్‌ లీగ్‌ను మరింత రసపట్టుగా తిర్చిదిద్దడానికి పవర్‌ ప్లేయర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఐపీఎల్‌ బోర్డు నిర్ణయించింది.

పవర్‌ ప్లేయర్‌ విధానం అంటే..

టీ20 మ్యాచ్‌లో వికెట్‌ పడగానే, చివరి ఓవర్‌లో మ్యాచ్‌ను గెలిపించడానికి నిర్ణయించిన బౌలర్‌ను లేదా బ్యాట్స్‌మెన్‌ను సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా బరిలోకి దింపేందుకు జట్టు యాజమాన్యం అనుమతిస్తుంది. కాగా ప్రతి జట్టు 15 మందిని ప్రకటిస్తుంది. ఐపీఎల్‌ కంటే ముందు ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ విధానంతో ఆట స్వరూపమే మారిపోయే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.