క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభ‌మ‌వుతుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌రోనా ముప్పుతో మార్చి 29 న ప్రారంభం కావాల్సిన ఐపిఎల్ ఏప్రిల్ 15కు వాయిదా ప‌డింది. ఇటీవ‌ల కేంద్రం లాక్‌డౌన్‌ను మే 3 పొడిగించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మే3 వ‌ర‌కు ఐపీఎల్ సాధ్యం కాదు.

తాజాగా.. బీసీసీఐ ఐపీఎల్ పై ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌లో తెలిపింది. మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుండ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. దేశ భ‌ద్ర‌తా, ప్ర‌జ‌ల ఆరోగ్యం మాకుఎంతో ముఖ్యం. ఎప్పుడైతే అంతా స‌వ్యంగా ఉంటుందో అప్పుడే ఐపీఎల్ నిర్వ‌హించ‌న‌ట్లు బీసీసీఐ తెలిపింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌రువాత అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి టోర్నీ నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చిస్తామ‌ని తెలిపింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.