ఐపీఎల్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు తప్పవా..!
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 2:31 PM GMTక్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మరికొంత ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే.. ఫస్టు మ్యాచ్ ఆడేందుకు చెన్నై జట్టు ఇంకా సిద్ధం కాలేదు.
చెన్నై జట్టులో నిన్న ఓ బౌలర్, నేడు ఓ బ్యాట్స్‌మెన్ తో పాటు మరో 10 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ ప్రభావం షెడ్యూల్ పై పడే అవకాశం ఉంది. అందరి కంటే ముందే దుబాయ్‌కు చెక్కేసిన ధోనీ సేన కరోనా కారణంగా ఇంకా క్వారెంటైన్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా లీగ్‌ను కొంత ఆలస్యంగా ప్రారంభించాలని బావిస్తున్నట్లు సమాచారం.
బోర్డు సీనియర్ అధికారి సమాచారం ప్రకారం.. షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా లీగ్‌ను కొంత ఆసల్యంగా ప్రారంభించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మ్యాచ్‌లు మొదలు కాకముందే కరోనా ప్రభావం చూపుతుండడంతో ఇప్పుడు ఈ సీజన్ సజావుగా సాగుతుందా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంచైజీ జట్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ ఆరంభించాయి.
కాగా.. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక్క మ్యాచ్ మిస్‌కాని సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ మొత్తానికే దూరం అయిన సంగతి తెలిసిందే. 13వ సీజన్ నుంచి రైనా తప్పుకుంటున్నట్లు జట్టు యాజమాన్యం అనుహ్యంగా ప్రకటించి అందరినీ అశ్చర్యంలో ముంచెత్తింది. బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ తేదీలను ప్రకటించినా.. షెడ్యూల్ ను విడుదల చేయలేదు.