ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీతో న్యూస్‌మీటర్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ: నూపుర్ శర్మ 2.0లో భాగమే రాజా సింగ్ వ్యాఖ్యలు

INTERVIEW: Raja Singh's video is Nupur Sharma 2.0; it is BJP's script to polarize voters before polls: Owaisi. ప్రస్తుతం తెలంగాణలోనూ, హైదరాబాద్ నగరంలోనూ చోటు చేసుకుంటున్న పరిస్థితులను లోక్ సభ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2022 12:39 PM IST
ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీతో న్యూస్‌మీటర్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ: నూపుర్ శర్మ 2.0లో భాగమే రాజా సింగ్ వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణలోనూ, హైదరాబాద్ నగరంలోనూ చోటు చేసుకుంటున్న పరిస్థితులను లోక్ సభ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిశితంగా గమనిస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయి. రాజా సింగ్ వ్యాఖ్యల తర్వాత రాజకీయ పరిస్థితుల గురించి అసదుద్దీన్ ఒవైసీ తన బిజీ షెడ్యూల్‌లో కొంత సమయం న్యూస్ మీటర్ కు ఇచ్చారు. న్యూస్ మీటర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టులు Coreena Suares, Kaniza Garari లు అసదుద్దీన్ ఒవైసీని పలు ప్రశ్నలు అడిగారు. ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ప్రశ్న: ముహమ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై గత మూడు రోజులుగా ఓల్డ్ సిటీలో ఉత్కంఠ నెలకొంది. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసే శుక్రవారంపై అందరి దృష్టి ఉంది. నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

అసదుద్దీన్‌ ఓవైసీ: ఈ శుక్రవారం సవాలుతో కూడిన రోజుగా భావిస్తూ ఉన్నాను. ఆ అల్లాహ్ కృపతో శాంతియుతంగా గడిచిపోతుందని నేను ఆశిస్తున్నాను. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, కేవలం ముస్లింలే కాదు, ఇతర మతాలకు చెందిన వారు కూడా. గత మూడు రోజులుగా రాత్రులు నాకు నిద్ర లేదు. మేము ప్రజల కోపాన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాము. మా పార్టీ సభ్యులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజా సింగ్ ఈ పరిస్థితిని తెచ్చిపెట్టడంలో ఆశ్చర్యం లేదు. అతని వీడియో సమస్యను మరింత పెద్దదిగా చేసింది. నేను ఏమి చెప్పగలను? ఇది చాలా చెడ్డ వీడియో. నగరంలో శాంతిభద్రతలు సజావుగా లేకుండా చేయడం బీజేపీ విధానం. తెలంగాణలో రాజకీయంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. వారు ప్రతిదీ ప్రయత్నించారు, అవేవీ వారికి సహాయం చేయలేదు. ఇప్పుడు మతం ముసుగులో.. మత కలహాలు సృష్టించాలని భావిస్తూ ఉన్నారు.

ప్రశ్న: ఈ వీడియో వెలువడిన కొద్ది గంటల్లోనే రాజా సింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఇది దేన్ని సూచిస్తుంది?

అసదుద్దీన్‌ ఓవైసీ: ఇది కేవలం కంటి తుడుపు చర్య. ఈ వివాదంలో బీజేపీ చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటోంది. నూపుర్ శర్మపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు.. తెలంగాణాలో అలాంటి ప్రవర్తనను అంగీకరించరు. చాలా మంది ముస్లిమేతరులలో కూడా ఈ ఘటనలపై కోపం ఉంది. ఈ ఘటనను ప్రజలు తేలిగ్గా తీసుకోలేదు. ఈ అంశం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ ఘటనను నూపుర్ శర్మ 2.0 అని చెబుతాను. ఏ రాజకీయ పార్టీతో సంబంధమున్న వారైనా, హైదరాబాద్‌లో గొడవలు ఎవరూ కోరుకోరు. నగరంలోని ఒక భాగం ప్రభావితమైంది, కానీ ప్రకంపనలు అంతటా వ్యాపించాయి. అందరూ టెన్షన్‌గా ఉన్నారు. చార్మినార్ ఒక పర్యాటక ప్రదేశం. గత మూడు రోజుల్లో చిన్న, పెద్ద వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. నిన్న రాత్రి 7 గంటలకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లను పోలీసులు మూసివేయించేశారు. ఎంతో మంది వ్యాపారాన్ని దెబ్బతీసింది. పండుగ సమయాల్లో ప్రజలు సాయంత్రం వేళల్లో షాపింగ్ కోసం వస్తారు. పోలీసులు షట్ డౌన్ చేయించడం ప్రతి వ్యాపారవేత్తను కలవరపరిచింది. ఈ అంశాలన్నీ సామాన్యులను, వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాన్ని బీజేపీ గుర్తించడం లేదు. దీన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరు.

నా నియోజకవర్గం నుండి కనీసం 10,000 మంది టెక్కీలు హైటెక్ సిటీ, చుట్టుపక్కల పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో అలాంటి వాతావరణాన్ని చూసి వారు కూడా కలవరపడ్డారు.

ప్రశ్న: రాజా సింగ్ వీడియో మునవర్ ఫారూఖీ షోకి ఇచ్చిన ఘాటు రియాక్షన్ అని మీరు అనుకుంటున్నారా?

అసదుద్దీన్‌ ఓవైసీ: ఎవరైనా దానిని ఊహించుకోవచ్చు. కానీ మునవర్ ఫారూఖీ షోలో అలాంటి వీడియో కోసం పిలవలేదు. హాస్యనటుడి వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. అతడు ఎగతాళి చేసి ఉంటే.. దాన్ని సాకుగా తీసుకుని మహ్మద్ ప్రవక్తను దుర్భాషలాడడం ఆమోదయోగ్యం కాదు. రాజా సింగ్ అంతటితో ఆగలేదు. మరింత ముందుకు వెళ్లి ఇస్లాంను కూడా విమర్శించాడు. రాజా సింగ్ ఫారూఖీ తల్లిని తిట్టి మరో దారుణానికి పాల్పడ్డాడు.

మొత్తం ఎపిసోడ్ ఓల్డ్ సిటీ, చుట్టుపక్కల ఉన్న విక్రేతల ఆర్థిక నష్టాలకు దారితీసింది. బుధవారం, పోలీసులు షాపులను మూసి వేయమని చెప్పడంతో పాల, ఆహార ఉత్పత్తులు పనికిరానివిగా మారడంతో వాటిని విసిరివేయవలసి వచ్చింది. రాజా సింగ్ అరెస్టు ఉద్రిక్తతకు ముగింపు కాదు. మరెన్నో ఘటనలు చోటు చేసుకోడానికి కారణమవుతుంది.

ప్రశ్న: రాజా సింగ్ కూడా దీన్ని కామెడీగా తీసుకోమని చెప్పారు కదా..?

అసదుద్దీన్‌ ఓవైసీ: తెలంగాణలో తానే తెలివైన వ్యక్తి అని రాజా సింగ్ అనుకుంటున్నారు. మనమందరం మూర్ఖులమా. ఈ వీడియోను రాజా సింగ్ రూపొందించి అప్‌లోడ్ చేశారు. మహ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యల కేసులో చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి సందేశం పంపాను. హైదరాబాద్‌లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యే రాజా సింగ్ వాయిస్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలని నేను పట్టుబడుతున్నాను, విచారణలో ప్రాసిక్యూషన్‌కు ఇది సహాయపడుతుంది.

ప్రశ్న: ఈ చర్యలు ఎన్నికల మూడ్‌ని సెట్ చేయడానికేనా?

అసదుద్దీన్‌ ఓవైసీ: బీజేపీ పార్టీ ఇక్కడితో ఆగదని చెబుతున్నాను. నేను అర్థం చేసుకున్నదాని ప్రకారం, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి మనం ఇలాంటి వ్యాఖ్యలను చూడబోతున్నాం. నూపూర్ శర్మ దైవదూషణ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను. ఈ మాటలు స్క్రిప్ట్‌లో భాగం. వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి. బిల్కిస్ బానో విషయాన్నే తీసుకోండి, ఇది వారి నిర్లక్ష్యానికి ఒక ఉదాహరణ. ఇప్పటివరకు 11 మంది దోషులకు రిమిషన్ ఆర్డర్ ఎక్కడ ఉంది? బీజేపీ చేస్తున్న ఈ చర్యలు ఎంత వరకు వెళ్తాయో ప్రజల్లో చూస్తారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు తెలంగాణాలో బీజేపీ ఉద్రిక్తతలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమే.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేవలం సస్పెన్షన్ వేటు పడింది. నుపుర్ శర్మ విషయంలో బీజేపీ నిరూపించింది ఏమిటంటే ఆమెను ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడమే.

ప్రశ్న: సెక్షన్ 41 CrPC కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు కదా..?

అసదుద్దీన్‌ ఓవైసీ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అనుమానించడం లేదు. వారు రూల్ బుక్ ప్రకారం ముందుకు వెళ్లారు. న్యాయమూర్తి ఈ సాంకేతిక లోపాన్ని గమనించి తదనుగుణంగా ఆదేశించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వీడియోలో రాజా సింగ్ నేను మరో వీడియో చేస్తాను అని బహిరంగంగా చెబుతున్నాడు. ఆ ప్రకటన సరిపోతుంది కానీ.. న్యాయమూర్తి దానిపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.

ప్రశ్న: ఈ ఘటనలు హైదరాబాద్ ఇమేజ్ పై ప్రభావం చూపబోతున్నాయా.. పెట్టుబడికి అనుకూలమైన, అభివృద్ధి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ పై ఎంత ప్రభావం చూపబోతోంది..?

అసదుద్దీన్‌ ఓవైసీ: హైదరాబాద్ అభివృద్ధికి పర్యాయపదమని, ప్రాజెక్టులన్నీ ముందుకు సాగుతున్నాయు. పాతబస్తీలో నాలా-అభివృద్ధి వంటి ప్రాజెక్టులతో అభివృద్ధి పనులతో బిజీగా ఉన్నాము. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రతిష్టకు ఈ ఘటన మచ్చగా మారింది.

ప్రశ్న: ఇది ఇక్కడితో ఆగిపోతుందని అనుకుంటూ ఉన్నారా..? ఇతర వ్యూహాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా?

అసదుద్దీన్‌ ఓవైసీ: బీజేపీ ఏదైనా చేయగలదు.. ఏ అంశాన్నైనా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణలో వారికి చాలా రిసోర్స్‌ఫుల్ టీమ్ ఉంది. ఆ బృందం తమ కంటూ స్పేస్‌ని సృష్టించేందుకు పగలు రాత్రి శ్రమిస్తోంది. రాష్ట్రానికి మిలాద్‌ జులుం, రామ జయంతి, హనుమాన్‌ జయంతి, ర్యాలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఈ మతపరమైన ఊరేగింపులలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఇవి శాంతియుతంగా జరిగేలా చూడడం ప్రతి రాజకీయ పార్టీకీ సవాలుగా మారనున్నాయి.

Next Story