కడప జిల్లాల్లో అంతర్ రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం
By సుభాష్ Published on 27 Sept 2020 4:41 PM IST
దోపిడీ గ్యాంగ్ కడప జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలను ఈ గ్యాంగ్ భారీ ఎత్తున ప్లాన్ చేసింది. ఈ క్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా రాజంపేట పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అంతర్ రాష్ట్రానికి చెందిన మొత్తం 21 మంది దోపీడీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.10,360 నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఓ కారు, మూడు బైక్‌లు, 15 మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు బళ్లారి, అనంతపురం తిరుపతి తదితర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇలాంటి అంతర్‌రాష్ట్ర ముఠా కలకలం రేపడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇంకా ఎక్కడైన సంచరిస్తున్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Next Story