3 కోట్ల రూపాయల కారును ధ్వంసం చేసేశాడు

YouTuber Destroys Lamborghini Worth Over 3 Crore. రష్యన్ యూట్యూబర్ ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన కారును నాశనం చేసాడు

By M.S.R  Published on  4 March 2023 9:00 PM IST
3 కోట్ల రూపాయల కారును ధ్వంసం చేసేశాడు

YouTuber Destroys Lamborghini


మార్కెటింగ్ స్టంట్‌లో భాగంహా 'మిఖాయిల్ లిట్విన్' పేరుతో ప్రసిద్ధి చెందిన రష్యన్ యూట్యూబర్ ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన కారును నాశనం చేసాడు. తెల్లటి లంబోర్ఘిని ఉరస్ SUVని పూర్తిగా ధ్వంసం చేసి, మొత్తం ఈవెంట్‌ను రికార్డు చేశాడు. భారతదేశంలో ₹ 3.15 కోట్ల ప్రారంభ ధర కలిగిన అల్ట్రా-లగ్జరీ కారును లిట్విన్ కు చెందిన ఎనర్జీ డ్రింక్ బ్రాండ్ 'లిట్ ఎనర్జీ' ప్రమోషన్ కోసం ముక్కలు ముక్కలు చేశాడు. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. యూట్యూబ్ లో లిట్విన్ కు 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

లిట్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ ఘటనకు సంబంధించిన క్లిప్‌ను పంచుకున్నారు. లంబోర్ఘిని ఉరస్ అత్యంత వేగవంతమైన SUVలలో ఒకటి. 2018లో దీన్ని ప్రారంభించారు. 4-డోర్ల లగ్జరీ SUV. ఈ లగ్జరీ కారు 4.0 లీటర్ V8, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.


Next Story