ఉక్రెయిన్ మీద రష్యా దాడులు ఏ మాత్రం ఆగని సంగతి తెలిసిందే..! ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఓ తల్లి తన 18 నెలల కొడుకును కోల్పోయిన వేదనను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోతూ ఉంది.
కిరిల్ యాత్స్కో అనే 18 నెలల బాలుడు రష్యా దాడి సమయంలో గాయపడ్డాడు. మారియుపోల్‌లోని అతని ఇంటిపై రష్యా దాడి చేసింది. అతని తల్లి మెరీనా, ఆమె ప్రియుడు ఫెడోర్ అపస్మారక స్థితిలో ఉన్న పసిబిడ్డతో ఆసుపత్రికి వెళ్లడం వీడియో ఫుటేజీలో ఉంది. కిరిల్ గుండె ఆగిపోయిందని వైద్యులు భావించారు. అతడికి చికిత్సను అందిస్తూ వచ్చారు. వైద్యులు అతని ముఖంపై ఆక్సిజన్ మాస్క్‌ను ఉంచి తిరిగి గుండె కొట్టుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేశారు. కానీ ఆ పిల్లాడిని బ్రతికించలేకపోయారు. కానీ అతడిని రక్షించలేకపోయారు. దీంతో ఆ తల్లి పడ్డ బాధ, రోదనలు వర్ణణాతీతం అయ్యాయి.
రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై తమ పట్టును బిగించే క్రమంలో ఉక్రెయిన్‌లోని అతి ముఖ్యమైన నగరమైన మారియుపోల్‌ను చుట్టుముట్టింది. కాల్పులకు విరామం ఇచ్చినట్లు రష్యా చెబుతున్నా, ఉక్రేనియన్ అధికారులు మాత్రం రష్యా శనివారం పలు నగరాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ప్రజలు, నివాస ప్రాంతాలపై రష్యన్లు దాడులు చేస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.