మరో కొత్త‌ వైరస్.. సోకితే ప్ర‌తి ముగ్గురిలో ఒకరు మృతి..!

Wuhan Scientists Warn of New Coronavirus Strain With High Death.కొత్త కొత్త వేరియంట్ల‌తో క‌రోనా వైర‌స్ మాన‌వాళిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 1:06 PM IST
మరో కొత్త‌ వైరస్.. సోకితే ప్ర‌తి ముగ్గురిలో ఒకరు మృతి..!

కొత్త కొత్త వేరియంట్ల‌తో క‌రోనా వైర‌స్ మాన‌వాళిని ఇంకా వెంటాడుతూనే ఉండ‌గా.. ద‌క్షిణాఫ్రికా దేశంలో 'నియో కోవ్' అనే మ‌రో కొత్త వైర‌స్‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈ వైర‌స్‌పై చైనాకు చెందిన వూహాన్ యూనివ‌ర్శిటీ, ఇనిస్టిట్యూట్ ఆప్ బ‌యో ఫిజిక్స్ శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. నియో కోవ్ వైర‌స్‌కు వేగంగా వ్యాప్తి చెందే ల‌క్ష‌ణంతో పాటు మ‌ర‌ణాల రేటు కూడా అధికంగానే ఉండే అవ‌కాశం ఉంద‌ని వారు వెల్ల‌డించారు.

ఈ నియో కోవ్ వైరస్‌ను దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గబ్బిలాల్లో గుర్తించారు. ఇది కూడా వైర‌సే అని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్‌ తన కథనంలో వెల్లడించింది. ప్ర‌స్తుతం ఇది జంతువుల నుంచి జంతుల‌కు మాత్ర‌మే సోకుతుంద‌ని తెలిపింది. మ్యూటేష‌న్ల కార‌ణంగా జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకే ప్ర‌మాదం ఉంద‌ని అధ్య‌య‌నంలో తేలింది.

ఈ వైర‌స్ సోకిన ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు మ‌ర‌ణిస్తార‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా మాదిరిగానే ఇది మ‌నుషుల‌కు వేగంగా సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. కాగా.. ఈ క‌థ‌నంపై వెక్టార్ వైర‌స్ స్టేట్ రీస‌ర్చ్ సెంట‌ర్ ఆఫ్ వైరాల‌జీ అండ్ బ‌యోటెక్నాల‌జీ నిపుణులు స్పందించారు. నియో కోవ్‌పై చైనీస్ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన అధ్య‌య‌న ఫ‌లితాలు త‌మ‌కు కూడా తెలుస‌ని.. అయితే ఇది ప్ర‌స్తుతం జంతుల్లో మాత్ర‌మే ఉన్నందున దీనిపై అప్పుడే ఓ అంచనాకు రాలేమ‌న్నారు. చైనా శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ఫ‌లితాల‌పై మ‌రోసారి అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కాగా.. కొత్త వైర‌స్ వెలుగుచూడ‌డంతో ప్ర‌పంచం మ‌రోసారి అప్ర‌మ‌త్తం అయింది.

Next Story