మనుషుల ఎముకలు, పుర్రెలతో గోడ.. ఎక్కడుందో తెలుసా?

18వ శతాబ్దంలో ప్యారిస్‌లో ఒక్కసారిగా భారీగా మరణాలు సంభవించాయట. మృతదేహాలను పాతిపెట్టడానికి శ్మశానాలు కూడా సరిపోక

By అంజి  Published on  17 March 2023 5:00 PM IST
Worlds scariest place,  basement of tombs, France, Paris

మనుషుల ఎముకలు, పుర్రెలతో గోడ.. ఎక్కడుందో తెలుసా

ప్రపంచంలో ఎన్నో మిస్టీరియస్ ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్నింటి పేర్లు వింటేనే మనకు వణుకు పడుతుంది. అయితే ఫ్రాన్స్ అనగానే ముందుగా అందరికీ గుర్తించే పేరు ప్యారిస్. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వెళ్తుంటారు. కానీ చాలా మందికి అక్కడ ఒక మిస్టీరియస్ ప్రాంతం ఉందని తెలియదు. ఈ ప్రాంతం గురించి తెలిస్తే మీకు వణకు పుట్టడం ఖాయం. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని మనుషుల శవాలతో నిర్మించారు.

18వ శతాబ్దంలో ప్యారిస్‌లో ఒక్కసారిగా భారీగా మరణాలు సంభవించాయట. మృతదేహాలను పాతిపెట్టడానికి శ్మశానాలు కూడా సరిపోక రోడ్లపై ఉంచారట. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక సున్నపు గనుల్లో మృతదేహాలను పడేశారట. ఇతర ప్రాంతాల నుంచి కూడా మృతదేహాలను తీసుకొచ్చి గనుల్లో పడేశారట. అలా కొద్దిరోజుల్లోనే గనుల్లో 60 లక్షల మృతదేహాలు పడేశారట.

కొన్నేళ్ల తర్వాత శవాల ఎముకలు, పుర్రెలతో భూమిలోపల 20 మీటర్ల లోతులో 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించారు. ఆ తర్వాత దానిని మ్యూజియంగా మార్చారు. దానినే ఇప్పుడు 'బేస్‌మెంట్ ఆఫ్ టోంబ్స్' అని పిలుస్తున్నారు. ఈ మ్యూజియం దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉంది. దానిని చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఎముకలు, పుర్రెలతో నిర్మించిన మొత్తం గోడను పర్యాటకుల సందర్శనకు ఉంచలేదు. సొరంగంలోని కొంత భాగాన్ని మాత్రమే చూసేందుకు పర్యాటకులకు అనుమతిచ్చారు.

Next Story