అందమైన యువతి ప్రాణాలు తీసిన కుక్క..!
Woman mauled to death rescue dog Birmingham. యజమాని ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కుక్క.. చివరికి ఆ యజమాని ప్రాణాలనే తీసింది.
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2021 4:10 PM ISTవిశ్వాసం గల జంతువు ఏది అని అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం కుక్క. ఈ ప్రపంచంలో దానిని మించిన విశ్వాసం దేనికి ఉండదని అంటుంటారు. అది నిజమే కానీ మనిషిలా ఆలోచించేంత జ్ఞానం వాటికి లేదు. అందుకే పెంపుడు జంతువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఇప్పుడు మనం చదవబోయే సంఘటన నిరూపించింది. ఓ యజమాని ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కుక్క.. చివరికి ఆ యజమాని ప్రాణాలనే తీసింది. ఈ దారుణ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెలితే.. బర్మింగ్‌హామ్‌లోని కిట్స్‌గ్రీన్ ఏరియాలో కైరా లాడ్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈమె పిల్‌బుల్ డాగ్‌ను పెంచుకుంటోంది. కాగా.. శుక్రవారం ఇంట్లో వాళ్లు బయటికి వెళ్లగా.. కైరా ఒక్కతే ఒంటరిగా ఉంది. తన గదిలో నిద్రపోతుంది. అదే సమయంలో ఆ పిట్‌బుల్ డాగ్ ఆమె చేతిని కొరికి, చీల్చిపడేసింది. తీవ్రమైన బాధతో ఆమె ఎంత అరుస్తున్నా కూడా అది విడిచిపెట్టలేదట. ఆమె అరుపులు విన్న పక్కంటి వారికి లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదంట. వెంటనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే ఆమె బంధువు ఒకరు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు తీవ్రగాయాలతో పడి ఉన్న కైరాను గుర్తించారు. అయితే.. అప్పటికే ఆమె మరణించింది. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ కుక్క వల్లే కైరా చనిపోయిందని పోలీసులు బావించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.