ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. టిజి ఒజౌ, బెజాయియా ప్రావిన్సులోని అటవీ ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు వల్ల మొత్తం 42 మంది మృతి చెందారు. వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరించారు. అగ్నిమాపకశాఖ అధికారులు, సైనికులు కలిసి 110 కుటుంబాలను మంటల బారి నుంచి రక్షించినట్లు ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేసింది. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు మృత్యువాత పడుతున్నారు.
కార్చిచ్చు వల్ల కొంగలు గ్రీస్ దాటి పోతున్నాయి. ఈ మంటల వల్ల కబీలీ ప్రాంతంలో పశువులు, కోళ్లు మరణించాయి. కార్చిచ్చు వెనుక ఎవరి హస్తం అయినా ఉండవచ్చని అల్జీరియా మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. పౌరులను రక్షించేందుకు, కార్చిచ్చు ఆపేందుకు అల్జీరియా ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. చాలా ప్రాంతాల్లో అడవుల్లో మంటలు వ్యాపించగా.. కబైలీ ప్రాంతంలోని కుటుంబాల జీవనోపాధిని అందించే ఆలివ్ చెట్లు కాలిపోగా.. పశువులు మృత్యువాతపడ్డాయి. బాధితులకు పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి 13 ప్రావిన్స్‌ల్లో మంటలు చేలరేగగా అడవులు కాలిబూడిదవుతున్నాయి.