డెల్టా + ఒమిక్రాన్‌ = డెల్మిక్రాన్‌.. కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మిదే..!

What is Delmicron Is it a new variant or a mutant.క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో మ‌న‌ల్ని వ‌దిలేలా లేదు. స‌రికొత్త రూపాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 1:00 PM IST
డెల్టా + ఒమిక్రాన్‌ = డెల్మిక్రాన్‌..  కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మిదే..!

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో మ‌న‌ల్ని వ‌దిలేలా లేదు. స‌రికొత్త రూపాల్లో మాన‌వాళిపై త‌న దండ‌యాత్ర‌ను కొన‌సాగిస్తూనే ఉంది. అమెరికా, బ్రిట‌న్ వంటి దేశాల్లో మ‌ళ్లీ కేసులు పీక్స్‌కు చేరుకున్నాయి. అమెరికాలో ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల కేసులు వెలుగుచూడ‌గా బ్రిట‌న్‌లో వ‌రుస‌గా రెండో రోజు రెండు ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ఈ రెండు దేశాల్లోనే కాకుండా ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇట‌లీ, కెన‌డాల్లో భారీగా కేసులు న‌మోదు అవుతున్నాయి. దీనికి కార‌ణం క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అని భావిస్తుండ‌గా.. నిపుణులు మాత్రం దీని వెనుక 'డెల్మిక్రాన్' అనే డ‌బుల్ వేరియంట్ అని చెబుతున్నారు. దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్‌ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

డెల్మిక్రాన్ అంటే..?

ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్‌ కరోనా కొత్త వేరియంట్‌ కాదని.. ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని అంటున్నారు. దీన్ని డబుల్‌ వేరియంట్‌గా చెబుతున్నారు. డెల్టా+ఒమిక్రాన్ ను క‌లిపి డెల్మిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఒకే వ్య‌క్తికి ఒకే స‌మ‌యంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా సోకితే డెల్మిక్రాన్‌గా ప‌రిగ‌ణిస్తారు. అలాగే.. డెల్టా నుంచి కోలుకుంటున్న వ్య‌క్తికి.. మ‌రో వేరియంట్ ఒమిక్రాన్ సోకితే డెల్మిక్రాన్ ఇన్ఫెక్ష‌న్‌గా చెబుతారు. ఇది చాలా అరుదుగా జ‌ర‌గొచ్చున‌ని అంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ కరోనా వైరస్ వేరియంట్ల బారినపడిన వారికి దగ్గరగా వెళ్లిన వారిలో ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

లక్ష‌ణాలు..

డెల్మిక్రాన్‌ సోకిన వారిలో అధిక జ్వరం, నిరంతర దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరలాంటి లక్షణాలను నిపుణులు గమనించారు. కాగా.. భారత్‌లో ఇటీవ‌ల ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే.. ఇంతవరకు డెల్మిక్రాన్‌ వేరియంట్ మాత్రం దేశంలో వెలుగుచూడ‌లేదు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కార‌ణంగా ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంది. అయితే.. బ‌ల‌హీన రోగ‌నిరోధ‌క శ‌క్తి, వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ డ‌బుల్ ఇన్ఫెక్ష‌న్ ముప్పు ఎక్కువ‌గానే ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.


Next Story