నెమ్మదిగా సాగుతోంది.. వేగం పెంచండి: యూఎన్‌ఓ చీఫ్
We Need To End COVID-19 Pandemic.ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న
By అంజి Published on 21 Sep 2021 4:28 AM GMTప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని యూఎన్‌ఓ ఆవేదన వ్యక్తం చేసింది. మహమ్మారి వీలైనంత త్వరగా అంతమొందించేందుకు ప్రపంప దేశాలు పనిచేయాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 76వ సర్వసభ్య సమావేశంలో గుటెర్రస్ మాట్లాడారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో చాలా దేశాలు వెనుకపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ వేగవంతంగా జరగాలని కోరారు. ప్రపంచ మునుపెన్నడూ లేని విధంగా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని.. వాతావరణమార్పులు, కరోనా వైరస్, పలు వివాదాలు, ఆక్రమణలు, సుస్థిర అభివృద్ధిలో వెనుకబాటుతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. అయితే వీటన్నింటిని అధిగమించాలని గుటెర్రస్ పిలుపునిచ్చారు.
జూన్ 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ అందించేలా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని యూఎన్‌ఓ చీఫ్ గుటెర్రస్ అన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా ధాటికి ఇప్పటికే 40 లక్షలకుపైగా ప్రజలు ప్రాణాలు విడిచారు. పేదరికాన్ని అడ్డుకునేందుకు సంక్షోభంలో ఉన్న దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలా చేస్తేనే పేదరికానికి అడ్డుకట్ట వేసినవారవుతారని పేర్కొన్నారు. ఎక్కడా కూడా లింగసమానత్వం లేకపోతే సరైన లక్ష్యాలను చేరుకోలేమని.. పురుషులకు సమానంగా మహిళలకు హక్కులు కల్పించాలన్నారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని యూఎన్‌ఓ చీఫ్ గుటెర్రస్ అన్నారు.