పుతిన్ కు క్యాన్సర్ సర్జరీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనారోగ్యం బారిన పడ్డాడా..? ఏడాదిన్నరగా కేన్సర్, పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న పుతిన్‌ కేన్సర్‌కు సర్జరీ చేయించుకోనున్నారనే వార్తలు వచ్చాయి.

By Medi Samrat  Published on  2 May 2022 10:04 AM IST
పుతిన్ కు క్యాన్సర్ సర్జరీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనారోగ్యం బారిన పడ్డాడా..? ఏడాదిన్నరగా కేన్సర్, పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న పుతిన్‌ కేన్సర్‌కు సర్జరీ చేయించుకోనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వారంలోనే ఆపరేషన్‌ జరగవచ్చని రష్యా ప్రభుత్వ వర్గాల నుండి లీక్ లు వచ్చినట్లు తెలుస్తోంది. సర్జరీ జరిగి కోలుకునే దాకా ఉక్రెయిన్‌తో యుద్ధ బాధ్యతలను ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) మాజీ చీఫ్‌ నికోలాయ్‌ పత్రుషేవ్‌కు అప్పగించాలని పుతిన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ విజయానికి గుర్తుగా మే 9న రష్యా విజయోత్సవం లోపే ఆపరేషన్‌ చేయించుకోవాలని పుతిన్‌ భావిస్తున్నారని ప్రపంచ మీడియా చెబుతోంది. కేన్సర్, పార్కిన్సన్స్, స్కిజోఫ్రేనియా వ్యాధులకు హెవీ డోస్‌ మందులు తీసుకోవడంతో పుతిన్‌ బాగా బలహీనపడ్డారని, తక్షణం కేన్సర్‌ సర్జరీ చేయించుకోవాలని ఆయనకు చికిత్స చేస్తున్న వ్యక్తిగత వైద్యులు సలహా ఇచ్చారు.

రష్యా అధ్యక్షుడు అనారోగ్యం బారిన పడితే దేశ రాజ్యాంగం ప్రకారం ప్రధాని తాత్కాలికంగా అధికార బాధ్యతలు చేపట్టాలి. కానీ ప్రధాని మిఖైల్‌ మిషుస్తిన్‌ (56) గురించి తెలిసింది చాలా తక్కువే..! యుద్ధాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేవారు కావాలన్న ఉద్దేశంలో పత్రుషేవ్‌ కు పుతిన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పుతిన్ ఇప్పటికే శస్త్రచికిత్సను ఆలస్యం చేశారని డైలీ మెయిల్ నివేదించింది. పుతిన్ ఉక్రెయిన్ అంతటా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభిస్తారనే ఊహాగానాల మధ్య ఈ వార్త వచ్చింది. ఏప్రిల్ ద్వితీయార్థంలో శస్త్రచికిత్స జరగాల్సి ఉండగా ఆలస్యమైందని పేర్కొన్నారు. పుతిన్ "పార్కిన్సన్స్ వ్యాధి, స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్"తో కూడా బాధపడుతున్నాడనే కథనాలు వచ్చాయి. పుతిన్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని క్రెమ్లిన్ ఇప్పటికే ఖండించింది.

Next Story