ఉక్రెయిన్‌పై గత 10 రోజులుగా విధ్వంసకర దాడులు చేస్తోంది రష్యా. ఈ క్రమంలో పశ్చిమదేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించుకోవడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ గగనతాలన్ని నో ఫ్లై జోన్ విధించే ఏ ప్రయత్నమైనా రష్యాపై యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నాటో నిర్ణయాల వల్లనే ఉక్రెయిన్‌పై దాడికి దిగినట్లు తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించిన నాటో కూడా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు.
ఉక్రెయిన్‌పై భీకరంగా యుద్దం సాగిస్తామని చెప్పారు. ఉక్రెయిన్ మిలిటరీ మౌలిక సదుపాయాలను నాశనం చేయడం దాదాపుగా పూర్తి అయ్యిందన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తే ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతామన్నారు. ఉక్రెయిన్‌పై దాడులను వ్యతిరేకిస్తూ రష్యాలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు దేశంలో మార్షల్ లా అవసరం లేదని పుతిన్ అన్నారు.