ఆస్ట్రేలియా కరోనా వైరస్‌ తన పంజా విసురుతోంది. ఆ దేశంలోని కొన్ని నగరాల్లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. తాజాగా మెల్‌బోర్న్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. లాక్‌డౌన్‌ను తీసివేయాలంటూ ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

పోలీసులపై నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు పెప్పర్ స్పే ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో మెల్‌బోర్న్‌లో ప్రభుత్వం ఆరోసారి లాక్‌డౌన్ విధించింది. మరోవైపు సిడ్నీ, బ్రిస్బేన్‌, పెర్త్‌లోనూ లాక్‌డౌన్‌ వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు. తక్షణమే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు.

అంజి

Next Story